18/02/2026
Sangareddy News

Sangareddy News : సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో గ్యాస్ సిలిండర్ పంపిణీ ఆటో ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లా ప్రజల రక్షణలో నిమగ్నమయ్యే సిబ్బంది వెల్ఫేర్ మా బాధ్యత అని, సిబ్బంది సౌకర్యార్థం గ్యాస్ సిలిండర్‌ను ఆటో ద్వారా ఇంటింటికీ పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని ఎస్పీ అన్నారు. సిలిండర్ అవసరమున్న సిబ్బంది ఆన్‌లైన్ ద్వారా గాని, గ్యాస్ బుకింగ్ నెంబర్ కు మిస్ కాల్ ద్వారా గాని గ్యాస్ బుక్ చేసుకోవచ్చని అన్నారు. బుకింగ్ చేసిన తర్వాత, రెండు రోజుల కాల వ్యవధిలో పోలీసు విభాగంచే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్రీన్ ఆటో (ఎలెక్ట్రిక్) ద్వారా గ్యాస్ సిలిండర్‌ను గృహద్వారం వద్దకు తీసుకురావడం జరుగుతుంది అన్నారు. ఈ ప్రత్యేక సౌకర్యం సిబ్బందికి సులభమైన, వేగవంతమైన సేవలు అందించడమే లక్ష్యం అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సిహెచ్ రఘునందన్ రావ్, ఎ.ఆర్ డీఎస్పీ నరేందర్, డిఎస్పీ లు సత్యయ్య గౌడ్, ప్రభాకర్, సైదా నాయక్, ఆర్.ఐ.లు రామారావ్, రాజశేఖర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *