
Sangareddy News : సంగారెడ్డిలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. 31వ వార్డు బాలాజీ నగర్ లోని కృష్ణ చైతన్య యూత్ వినాయక మండపం వద్ద ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తనయుడు చింత సాయినాథ్ విఘ్నాలను తొలగించే ఆది దేవుడు గణపయ్యకు పూజలు నిర్వహించారు. గొల్ల ఆంజనేయులు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది. ఈ సందర్భంగా చింత సాయినాథ్ మాట్లాడుతూ, ఐక్యత, భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు.