సంగారెడ్డి జిల్లాలో 40 మంది స్కూల్ అసిస్టెంట్లకు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి

Sangareddy News : సంగారెడ్డి జిల్లా విద్యా విభాగంలో పదోన్నతులు జ‌రిగాయి. మొత్తం 40 మంది స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులకు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

పదోన్నతి పొందిన ఉపాధ్యాయులు శుక్రవారం తమకు కేటాయించిన పాఠశాలల్లో విధుల్లో చేరాలని డీఈఓ సూచించారు. అంతేకాకుండా, పదోన్నతి పొందిన ఉపాధ్యాయులను జిల్లా విద్యాధికారి అభినందించారు.

ఈ నియామకంతో సంగారెడ్డి జిల్లాలో విద్యా ప్రమాణాలు మరింత మెరుగవుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *