
Sangareddy News : సిద్దాపూర్‌లో జాతీయ క్రీడా దినోత్సవాన్ని వ్యాయామ ఉపాధ్యాయులు మన్సూర్ గారు, మ్యూజిక్ మాస్టర్ & కుంగ్‌ఫూ–కరాటే శిక్షకులు మాస్టర్ గారి సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ, ఈద్గా మైదానం వరకు సాగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న క్రీడాకారులకు బహుమతులను సంగారెడ్డి జిల్లా కురుమ సంఘం సీనియర్ నాయకులు మరియు మునిపల్లి మండల బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బండారి పాండు గారు అందజేశారు.
క్రీడా పోటీల్లో సెయింట్ ఆంథోనీస్ హై స్కూల్, మోనో ప్లే, సెయింట్ మేరీస్, శ్రీ వికాస్, లిటిల్ బర్డ్స్, ఆక్స్ఫర్డ్, మైనార్టీ పాఠశాలల విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.
ముఖ్య అతిథులుగా సాజిద్ గ్రాండ్ మాస్టర్, బాలరాజ్ (భవిత కాలేజ్ ప్రిన్సిపల్), రవి (సాధన డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్), శ్రీనివాస్ గౌడ్ (వ్యాయామ ఉపాధ్యాయులు) హాజరయ్యారు. అలాగే నందారం రామకృష్ణారెడ్డి, రాఫె అల్తాఫ్, కృష్ణ, సంగమేశ్వర్, మహేష్, శ్రీధర్, అనిల్ తదితర క్రీడాభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.