18/02/2026
సీగాచి పరిశ్రమ పేలుడు బాధితులకు పరిహారం కోరుతూ జిల్లాకలెక్టర్ మరియు ఎస్పీని కలిసి మాట్లాడుతున్న ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్ రావు మరియు నాయకులు

Sangareddy News : పటాన్చేరు రు మండలంలోని పాశమైలారం పరిశ్రామిక వాడలోని సీగాచి పరిశ్రమలో పేలుడు సంబవించి 54మంది కార్మికులు మృతి చెందిన బాధితులకు… మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గతంలో వారికి అండగా ఉండి బాధితుల కుటుంబ సభ్యులతో కలసి సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కు వచ్చి సిగాచి పరిశ్రమ బాధితులకు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వంపై, కంపెనీ యాజమాన్యం పై ఒత్తిడి తీసుకొచ్చింది విధితమే.సిగాచి పరిశ్రమ ఘటన లో పూర్తి పరిహారం అందించాలని సోమవారం జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ను ,ఎస్పీ పరితోష్ పంకజ్ లను ఎమ్మెల్యే లు చింతా ప్రభాకర్, మాణిక్ రావు, మాజీ జడ్పీటీసీ గడిల శ్రీకాంత్ గౌడ్ లు కలిశారు.అనంతరం కలెక్టరేట్ వద్ద వారు మీడియాతో.ఈ సందర్భంగా మాట్లాడుతూ. …

పటాన్చెరు మండలం పాశమైలారం సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో 54 మంది కార్మికులు మరణించిన బాధిత కుటుంబ సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి మరియు సీగాచి పరిశ్రమ యాజమాన్యం మృతుల కుటుంబాలకు పరిహారం క్రింద రూ.కోటి పరిహారం అందజేస్తామని అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. కానీ ఇంతవరకు ఇస్తామన్న కోటి రూపాయల పరిహారం చేరలేదని జిల్లా కలెక్టర్ ప్రావీణ్యకు ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్ రావు లు గుర్తుచేశారు. ఇంత వరకు నాలుగు మాసాలు గడిచినా బాధితులకు పరిహారం అందలేదని మండిపడ్డారు. సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో ఆధారాలు ఉన్న ఇంతవరకు యాజమాన్యాన్ని అరెస్ట్ చేయలేదని, యాజమాన్యం పై క్రిమినల్ కేసు నమోదు చేయాల్సి ఉన్న అది జరగలేదన్నారు. జిల్లా ఎస్పీ స్పందిస్తూ ఈ విషయం లో సంబంధిత యాజమాన్యానికి ఆరు సార్లు నోటీసులు ఇవ్వడం జరిగిందని, తదుపరి కార్యాచరణ ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపినట్లు ఎమ్మెల్యేలు తెలిపారు. ఆగమేఘాల మీద సీఎం రేవంత్ రెడ్డి సిగాచి పేలుడు బాధితులకు రూ. కోటి రూపాయలు ఇస్తామని చేతులు దులుపుకున్నారని ఎమ్మెల్యేలు అన్నారు. సిగాచి పేలుడు ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు 25 లక్షలు కంపెనీ నుంచి ,ఒక లక్ష రూపాయలు మాత్రమే ప్రభుత్వం తరుపున ఇచ్చారని మిగతా పరిహారం కోసం బాధిత కుటుంబ సభ్యులు కళ్ళల్లో వత్తులు వేసుకుని చూస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఘటన స్థలానికి సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రి సంబంధిత మంత్రులు, అధికారులు వచ్చినా … !ఈరోజు వరకు సమస్య పరిష్కారం కాకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 2 లక్షల నష్టపరిహారం కూడా ఇంతవరకు అందలేదు , గత ప్రభుత్వంలో పరిహారాలు వెంటనే విడుదల చేసేదని గుర్తు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తామన్న పరిహారాన్ని వెంటనే బాధితులకు ఇవ్వాలని ఎమ్మెల్యేలు అన్నారు. సీగాచి ఘటన విషయంలో బాధితుల పక్షాన పోరాటం చేస్తున్న మెట్టు శ్రీధర్ సామాజిక కార్యకర్త 2018 నుంచి 2024 సంవత్సరం వరకు RTA ద్వారా రిపోర్ట్ లను సేకరించినవి జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ కి జత పరిచి అందజేశారు. ఈ కార్యక్రమంలో కాసాల బుచ్చిరెడ్డి మాజీ సీడీసీ చైర్మన్ ,ఆర్ వెంకటేశ్వర్లు సంగారెడ్డి పట్టణ పార్టీ అధ్యక్షులు, పేరమాళ్ళ నర్సింలు సంగారెడ్డి పట్టణ పార్టీ పట్టణ కార్యదర్శి, పార్టీ సీనియర్ నాయకులు మోహిజ్ ఖాన్, తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *