15/02/2026
ఎస్పీ పరితోష్ పంకజ్ గ్రామపంచాయతీ ఎన్నికల నేపధ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు సూచనలు చేస్తున్న దృశ్యం. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, చెక్‌పోస్టుల ఏర్పాటు మరియు చట్టవ్యవస్థ బలోపేతానికి సంబంధించిన సూచనలు ఇస్తున్న సమయంలో అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్న సమావేశ దృశ్యం.

Sangareddy News : ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ నందు ఎస్పీ గారు మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అధికారులు సిబ్బంది అప్రమత్తతతో విధులు నిర్వహించాలని సూచించారు. ఎన్నికలను ప్రభావితం చేసే ఏ ఇతరములు అక్రమ రవాణా జరగకుండా ఎఫ్ ఎస్ టీ, ఎస్ ఎస్ టీ లతో కోఆర్డినేషన్ తో చెక్‌పోస్టులను నిర్వహించాలని అన్నారు.
ఎస్.హెచ్.ఓ లు తమ, తమ ఏరియాలో గల సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించి, సంబంధిత అధికారులతో మాట్లాడుతూ.. అక్కడి పరిస్థితులను సమీక్షించాలని అన్నారు. హిస్టరీ షీటర్లను, గత ఎన్నికలలో అల్లర్లు సృష్టించిన వారిని సత్ప్రవర్తన కోరుతూ.. ముందస్తుగా బౌండ్ ఓవర్ చేయాలన్నా సూచించడం జరిగింది. నామినేషన్ కేంద్రం వద్ద 100 మీటర్ దూరంలో మార్క్ చేయించాలని, వీడియో రికార్డింగ్ చేయించాలని అన్నారు.
ఎన్నికల ప్రశాంత వాతావరణాన్ని ప్రభావితం చేసే విధంగా ఇతర వ్యక్తులను గాని, రాజకీయ పార్టీలను గాని కించపరిచే విధంగా సామాజిక మాద్యమాలలో అనుచిత వ్యాఖ్యలు చేసిన, ఫార్వార్డ్ మెసేజ్ చేసి, ఇతరుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తే.. ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ గారు తెలియజేశారు. ఎన్నికలకు సంబంధించిన పోలీస్ సిబ్బంది ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు చేపట్టకూడదని హెచ్చరించారు.

ఈ కాన్ఫరెన్స్ నందు అదనపు ఎస్పీ రఘునందన్ రావ్, సంగారెడ్డి డిఎస్పీ సత్యయ్య గౌడ్, ఎ. ఆర్ డిఎస్పీ నరేందర్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్, ఎస్బీ ఇన్స్పెక్టర్ కిరణ్, ఎలెక్షన్ సెల్ ఇన్స్పెక్టర్స్ ప్రవీణ్ రెడ్డి, సదా నాగరాజు, ఎలెక్షన్ సెల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *