18/02/2026
Sangareddy News

Sangareddy News : గత వారం రోజుల నుండి ఈ నెల 15వరకు జరిగిన స్పెషల్ లోక్-అదాలత్ లో భాగంగా, జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన, రాజీ పడటానికి అవకాశం ఉన్నటువంటి మరియు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న 366 – ఐ.పి.సి., 111- సైబర్ క్రైమ్, ఇ-పెట్టి -139, డిడి కేసులు – 629 మొత్తం = 1134 కేసులలో ఇరు వర్గాలను రాజీ కుదిరచడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ.. స్పెషల్ లోక్-అదాలత్ ను విజయవంతం చేసిన అధికారులు డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్, D4C- డిఎస్పీ వేణుగోపాల్ రెడ్డి, ఇన్స్పెక్టర్ రవి, లైజనింగ్ అధికారి సత్యనారాయణ ఎస్ఐ, కోర్ట్ డ్యూటీ, సైబర్ సెల్ సిబ్బందిని ఎస్పీ గారు అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *