Image Templatekn

Teaching Jobs: టీచింగ్ ఉద్యోగం చేయాలని అనుకునే వారికి ఇది శుభవార్త. సికింద్రాబాద్ ఆర్కే పురంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. రెగ్యులర్‌ ప్రాతిపదికన టీచింగ్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. అర్హులైన ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

2025-2026 అకడమిక్ ఇయర్‌కు గానూ టీచింగ్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. రెగ్యులర్‌, ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. రేపటితో దరఖాస్తు గడువు ముగియనుంది. ఓ సారి నోటిఫికేషన్‌కు సంబంధించి పూర్తి వివరాలను చూద్దాం.

ఉద్యోగ ఖాళీలు: ఈ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌లో భాగంగా పీజీటీ(ఫైన్‌ ఆర్ట్‌), టీజీటీ విభాగంలో ఇంగ్లీష్‌, హిందీ, మ్యాథ్స్, సోషల్ సైన్సెస్‌, కంప్యూటర్‌ సైన్స్‌, సైన్స్‌, ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ అండ్‌ పీటీఐ పోస్టులు ఖాళీలు ఉన్నాయి.

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి డిగ్రీ, బీఈడీ పూర్తి చేసి ఉండాలి. సంబంధింత కోర్సుల్లో పాసై ఉండాలి. అంతేకాకుండా సీటెట్ లేదా టట్ పాసై ఉండాలి. వర్క్ ఎక్స్‌పీరియన్స్ కూడా పరిగణలోకి తీసుకుంటారు.

వయస్సు: అభ్యర్థుల వయస్సు 40 ఏళ్ల లోపు ఉండాలి.

దరఖాస్తు ఫీజు: రూ.250 చెల్లించాలి.

దరఖాస్తు తేది: 2025 జనవరి 25 తేదీ లోపు అప్లికేషన్స్ పంపాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం: దరఖాస్తు రుసుమును డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ‘Army Public School RK Puram’ పేరుతో డీడీ కట్టాలి. ఆన్‌లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకునే దరఖాస్తు ఫామ్‌ను నింపి… “ది ప్రిన్సిపల్‌, ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌ ఆర్‌కే పురం, సికింద్రాబాద్” చిరునామాకు పంపించాలి.

అఫీషియల్ వెబ్‌సైట్: https://apsrkpuram.edu.in/

ముఖ్యమైన వివరాలు:

*దరఖాస్తు విధానం– ఆఫ్‌లైన్లో చేసుకోవాలి.

*ఫీజు: రూ.250

*దరఖాస్తు చివరి తేది: 2025 జనవరి 25.

టీచింగ్ జాబ్ చేయాలనుకునే వారికి ఇది సువర్ణవకాశం. రేపటితో గడువు ముగియనుంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే దరఖాస్తు చేసుకోండి. జాబ్ సాధించండి. ఆల్ ది బెస్ట్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *