
Telangana announces summer holidays for Intermediate colleges till June 1, 2025. Classes resume on June 2.
Trending News : తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు మరోసారి గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలోని అన్ని జూనియర్ కాలేజీలకు అధికారికంగా వేసవి సెలవులు ప్రకటించింది. ఇటీవల వార్షిక పరీక్షలు ముగియగా, అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జూన్ 1 వరకు సమ్మర్ హాలిడేస్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. కాలేజీలు జూన్ 2న తిరిగి ప్రారంభం కానున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డ్ స్పష్టం చేసింది.
అన్ని జూనియర్ కాలేజీలు ఈ ఉత్తర్వులను తప్పనిసరిగా పాటించాలని, సెలవుల సమయంలో తరగతులను నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఇతర ముఖ్యమైన వివరాలు: ఇంటర్మీడియట్ పరీక్షా పత్రాల స్పాట్ వాల్యుయేషన్ వేగంగా కొనసాగుతోంది.
ఏప్రిల్ మూడో వారంలో ఫలితాలు విడుదల కానున్నట్లు అధికారులు ప్రకటించారు.