
Jobs Update : తెలంగాణ: గ్రూప్-3, గ్రూప్-4 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ను నిర్వహించేందుకు యోచిస్తోంది. ఈ నేపథ్యంలో తొలి దశగా సుమారు 1,500 ఖాళీలను భర్తీ చేసేందుకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే, దీనిపై అధికారికంగా ఇంకా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) లేదా రాష్ట్ర ప్రభుత్వంనుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అధికారిక ప్రకటన వెలువడే వరకు అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్లను సందర్శిస్తూ అప్డేట్స్ కోసం వేచిచూడాల్సి ఉంటుంది.