16/02/2026
సదాశివపేటలోని శ్రీ విరాంజనేయ స్వామి ఆలయంలో వాహనం మరియు ధ్వజ స్థంభ ప్రతిష్ఠాపనలో పాల్గొంటున్న ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారు

Sadashivpet News : సదాశివపేట పట్టణంలోని శ్రీ విరాంజనేయ స్వామి ఆలయంలో వాహనం, ధ్వజ స్థంభ ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ మహోత్సవానికి సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారు , ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు

ఆలయ ప్రాంగణం భక్తుల‌తో కిటకిటలాడింది. వేద మంత్రోచ్చారణల మధ్య వాహన ప్రతిష్ఠ, ధ్వజ స్థంభ ఆవిష్కరణ పూర్తికాగా, దేవస్థాన అభివృద్ధికి సంబంధించి అవసరమైన అన్ని సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *