16/02/2026
Excise officials announce closure of wine shops, bars, and restaurants ahead of Gram Panchayat elections; dry day restrictions from tomorrow evening until December 11

TG: ఈ నెల 11న జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల తొలి విడతను పురస్కరించుకుని రాష్ట్రంలో డ్రైడేలు అమల్లోకి వస్తున్నాయి. రేపు సాయంత్రం 5 గంటల నుంచి 11వ తేదీ ఎన్నికల ముగింపు వరకు రాష్ట్రవ్యాప్తంగా వైన్స్‌, బార్లు, రెస్టారెంట్లలో మద్యపాన విక్రయాలను నిలిపివేయనున్నట్టు ఎక్సైజ్‌ శాఖ అధికారులు ప్రకటించారు.

ఎన్నికలు జరగబోయే ప్రాంతాల్లో ఈ ఆంక్షలను కట్టుదిట్టంగా అమలు చేస్తామని, ఎవరు నిబంధనలు ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తొలి విడత ఎన్నికలు ఈ నెల 11న మొత్తం 4,236 స్థానాల్లో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *