Sangareddy News : జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓటర్ల తుది జాబితాను బుధవారం విడుదల చేయనున్నట్లు జడ్పీ సీఈవో జానకి రెడ్డి తెలిపారు. గతంలో 8వ తేదీన ఓటర్ల ముసాయిదా జాబితాలను విడుదల చేశామని, వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత తుది జాబితాను విడుదల చేస్తున్నామని ఆయన ఒక ప్రకటనలో వివరించారు.
