ఘనంగా సేవా సంకల్ప్ అభియాన్
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు కర్ణం ఆదిత్య, యువమోర్చా అధ్యక్షుడు కాశీనాథ్ ఆధ్వర్యంలో సదాశివపేట మండలం నందికంది గ్రామంలో సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మోదీ ప్రజాసేవను కొనియాడారు. సుమారు 80 మంది రక్తదానం చేసినట్లు కర్ణం ఆదిత్య తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ, యువమోర్చా నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
#Nandikandi
🏛️ మన సంగారెడ్డి ప్రత్యేక కథనం
