Machareddy palli వార్తలు
తాజా వార్త
✍️ Bathini Shekhar ✓
⏱️ 4 రోజుల క్రితం • 14 Oct 2026

మాచిరెడ్డిపల్లిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

సదాశివపేట మండలం మాచిరెడ్డిపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో బతుకమ్మ వేడుకలను శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ మోహన్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచులందరికీ అతిపెద్ద పండుగని, మహిళలు వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో సంబరాలు జరుపుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, అంగన్‌వాడీ టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.

#Machareddy palli 🏛️ మన సంగారెడ్డి ప్రత్యేక కథనం
WhatsApp లో మిత్రులకు షేర్ చేయండి
⬅ మునుపటి వార్త ఘనంగా సేవా సంకల్ప్ అభియాన్ తర్వాతి వార్త ➔ భవానీమాత ఆలయ హుండీ దొంగ అరెస్ట్...