Sangareddy News : హైదరాబాద్ శివారులో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇన్ఫోసిస్ లో పనిచేస్తున్న ఎనిమిది మంది ఉద్యోగులలో ఒక యువతి మృతి చెందగా, ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సంగారెడ్డి జిల్లా వావిలాల గ్రామానికి చెందిన సౌమ్య రెడ్డి (25) తన సహోద్యోగులతో కలిసి సరళ మైసమ్మ తల్లి ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బొంగ్లూర్ వద్ద ఓఆర్ఆర్ లో కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. అతివేగం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సౌమ్య రెడ్డి మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
