18/02/2026
కొండాపూర్ మండలానికి చెందిన నూతన సర్పంచులు, వార్డు మెంబర్లు ఎమ్మెల్యేను కలిసిన దృశ్యం

Sangareddy News : కొండాపూర్ మండలం కు చెందిన హరిదాస్, మారేపల్లి, తమ్ముల భాయ్ తండా, మాచిరెడ్డి పల్లి, చర్లగూడెం నూతన సర్పంచులు,వార్డు మెంబర్ లు ఎమ్మెల్యే ను కలిశారు.
బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపుకు కృషి చేసిన పార్టీ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…గత ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని గుర్తు చేశారు..కేసీఆర్ పాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సదాశివపేట మండల అధ్యక్షులు పెద్ద గొల్ల ఆంజనేయులు, కంది మండల పార్టీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, మాజీ సర్పంచ్ లు,మొగులయ్య ,మాణిక్యం వార్డ్ మెంబర్లు,తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *