18/02/2026
sadashivpet-malapahad-school-students-tracksuit-shoes-distribution

Sadashivpet News : బుధవారం రోజున సదాశివపేట మండలంలోని ప్రాథమిక పాఠశాల మాలపహాడ్ లో విద్యార్థులకు ఎం.రవీందర్ రెడ్డి అండ్ ఫ్రెండ్స్ ట్రస్ట్ తరఫున ట్రాక్ సూట్ మరియు షూ పంపిణీ చేయడం జరిగిందని మండల విద్యాధికారి ఎన్.శంకర్ తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు ఇలాంటి అవకాశాలను సద్వినియోపరుచుకొని విద్యార్థులు కష్టపడి చదివి, భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని తెలిపారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యురాలు సుమలత మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నిస్వార్ధంగా తమ జీవితంలో ఇతరులకు సహాయం చేసే అవకాశం కలిగించాలని ఆ భగవంతుని ప్రార్థించాలని విద్యార్థులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండేందుకు తమ ట్రస్ట్ సహాయం చేస్తుందని తెలియజేశారు.
మన సదాశిపేట మండలంలో ఎన్నో పాఠశాలకు డ్యూయల్ డెస్క్, సివిల్ వర్క్స్, వాటర్ ప్లాంట్స్ మొదలగు అవసరాలను తమ ట్రస్ట్ ద్వారా అందించామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్.ఎం మహేష్, ఉపాధ్యాయులువిజయరావుష్, అక్బర్, సిఆర్పిలు మల్లేశం, రాజేశ్వర్,విద్యార్థుల తల్లిదండ్రులు మరియు తదితరులు పాల్గొన్నారని మండల విద్యాధికారి ఎన్.శంకర్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *