14/04/2026

Sadashivpet News : సదాశివపేట పట్టణం నందు శాంతినికేతన్ విద్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా విద్యాధికారి ఆదేశానుసారం సదాశివపేట పట్టణం నందు శాంతినికేతన్ విద్యాలయంలో ప్రజాపాల దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది .పాఠశాల కరస్పాండెంట్ మాలిపటేల్ ప్రభు మాట్లాడుతూ నిజాం కాలంలో ప్రజలు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. నిజాం రాజుల యొక్క దుర్మార్గ పాలను అంతం చేయడానికి భారతదేశ మొట్టమొదటి ఉపప్రధానమంత్రి అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చాలా పర్యాయాలు నిజాం పాలకులకు సందేశం పంపిన ఎలాంటి స్పందన లేకపోవడంతో, భారత సైన్యం తీసుకొని హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయాలని ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ నడి ఒడ్డు పై అడుగుపెట్టగానే చేసేదేమీ లేక నిజం రాజు తెలంగాణను భారత దేశంలో విలీనం చేసిన రోజు ఈ రోజు కాబట్టి ఈరోజు మాన్యులు శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గుండె ధైర్యాన్ని , వారిలో ఉన్న సమైక్యత భావాన్ని, నైజాంప్రాంత ప్రజల పట్ల వారికి ఉన్నటువంటి ప్రేమాభిమానాల పట్ల తెలంగాణ ప్రజలు ఎప్పుడు ఋణపడి ఉంటారు . ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *