18/02/2026
Additional SP CH Raghunandan Rao paying floral tributes to Konda Laxman Bapuji at Sangareddy District Police Office on his Jayanti.

Sangareddy News : కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతిని పురస్కరించుకొని, సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అదనపు.ఎస్పీ సిహెచ్. రఘునందన్ రావ్ గారు.
ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ గారు మాట్లాడుతూ.. అన్ని వర్గాల సంక్షేమం కోసం పోరాడిన వారు బాపూజీ అని, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తెలంగాణ తొలి ఉద్యమకారుడు, దేశ స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని, అవే విలువలను జీవితాంతం పాటిస్తూ తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు అన్ని దశల ఉద్యమాలలోనూ స్ఫూర్తిగా నిలిచారని, అణగారిన వర్గాల హకుల సాధన కోసం, సహకార రంగాల పటిష్టత కోసం జీవితమంతా కృషి చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ గొప్ప మహనీయుడని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఇ.కళ్యాణి, ఐటి సెల్ ఇన్స్పెక్టర్ సదా నాగరాజు, ఆర్ఐ. లు రామారావ్, శ్రీనివాస్ రావ్, ఇన్స్పెక్టర్స్ నాగేశ్వర్ రావ్, డీపీఓ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *