17/02/2026
Collapsed building of Munipalli Social Welfare Residential School where three students suffered minor injuries, with police and officials inspecting the site.

Sangareddy News : ఈ రోజు తేది: 09- 09- 2025 నాడు మధ్యాహ్నం సుమారు 2:30 గంటల సమయంలో మునిపల్లి మండలంలోని లింగంపల్లి గ్రామంలో గల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ / జూనియర్ కళాశాల ( బాలురు) భవనం కూలిన ఘటనలో 3 విద్యార్థులకు స్వల్ప గాయాలు… విషయం తెలుసుకున్న మునిపల్లి ఎస్ఐ రాజేష్ నాయక్, కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బంది సహాయంతో కలిసి గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది..చికిత్స చేసిన డాక్టర్లు ఎలాంటి అపాయం లేదని స్పష్టం చేశారు. సంఘటన స్థలాని సందర్శించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ గారు ఘటనపై సమీక్ష నిర్వహించాలని అధికారులకు సూచించడం జరిగింది. అదే విధంగా పిల్లలను తాత్కాలికంగా సురక్షితమైన ప్రదేశానికి తరలించాలని అధికారులకు సూచించారు. అనంతరం జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని, అక్కడ చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *