18/04/2026

Munipally News : నేడు మునిపల్లి మండలంలోని ఇబ్రహీంపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో పల్లెల్లో ప్రతి స్వయం సహాయక సంఘం ఆడబిడ్డ ఇంటికీ ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మునిపల్లి మండల నాయకులు పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి వర్యులు దామోదర్ రాజనర్సింహ గారి ఆదేశాల మేరకు, మునిపల్లి మండల కేంద్రంలో స్వయం సహాయక సంఘాల ఆడబిడ్డలకు ‘పుట్టింటి సారె’ మాదిరిగా ఆత్మగౌరవానికి ప్రతీకగా నాణ్యమైన ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశామని నాయకులు తెలిపారు.

కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిల్లోడీ సతీష్ కుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ రైకోడ్ చైర్మన్ యం. సుధాకర్ రెడ్డి, ఎంపీడీఓ, DT ప్రదీప్ APM, నర్సింలు CC, సంగమేశ్వర్, శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షులు రసూల్ పటేల్, ఇబ్రహీంపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ అలీ, సీనియర్ నాయకులు అశోక్, గ్రామ కాంగ్రెస్ నాయకులు మరియు స్వయం సహకార సంఘ మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *