15/04/2026

Jogipet News : జోగిపేట- అజ్జమర్రి బ్రిడ్జి నిర్మాణ పనుల పురోగతి పై R & B శాఖ అధికారులతో మంత్రి చర్చించారు . ఈ సమీక్ష లో బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ పూర్తి చేయాలనీ మంత్రి ఆదేశించారు బ్రిడ్జి కు అనుసంధానం చేసే అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి వెల్లడించారు . రెవిన్యూ , R & B , ఇరిగేషన్ శాఖల మధ్య సమన్వయం చేసుకొని బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలనీ మంత్రి దామోదర్ రాజనర్సింహా అధికారులకు దిశానిర్శనం చేశారు . భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారులకు వెంటనే మరమ్మతులు పూర్తి చేయాలన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్శింహా .

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ ప్రజలకు మెరుగైన రోడ్డు రవాణా సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈ సందర్భంగా జోగిపేట-అజ్జమర్రి మార్గంలో మంజీరా నదిపై నూతన బ్రిడ్జి నిర్మాణంతో పాటు ఇరువైపులా రోడ్డు నిర్మాణం కోసం ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయాలని నీటిపారుదల శాఖ, ఆర్ అండ్ బి శాఖల అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తి అయితే మెదక్ జిల్లాలోని చిలిపిచెడ్, మండలంతో పాటు సంగారెడ్డి జిల్లాలోని అందోల్, హత్నూర మండలాల ప్రజలు జోగిపేటకు రాకపోకలు సాగించడానికి సులువుగా ఉంటుందన్నారు. ఈ మార్గంలో బ్రిడ్జితో పాటు నూతన రోడ్డు ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారులకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఇందుకు పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశించారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా త్వరితగతిన రోడ్ల మరమ్మతులకు చర్యలు తీసుకోవాలన్నారు . మత్తకేసారం రోడ్డు నిర్మాణం పనులు, కుసులూరు_గార్లపల్లి రహదారి నిర్మాణం పనుల పురోగతిపై మంత్రి అడిగి తెలుసుకున్నారు . పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

నియోజకవర్గంలో చేపట్టిన రోడ్డు నిర్మాణం పనులు, విస్తరణ పనులు వేగవంతంగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు ఆదేశించారు .

ఈ కార్యక్రమం లో ఆర్ &బి ఎస్ ఈ వసంత్ నాయక్ , ఏ నర్సింహులు , డి ఈ రవీందర్ , ఏ ఈ ఈ శశాంక్ , రెవిన్యూ అధికారులు ,పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *