18/02/2026
Sangareddy News

Sangareddy News : జిల్లా వైద్యాధికారి డాక్టర్ నాగ నిర్మల శుక్రవారం వెల్లడించిన వివరాల ప్రకారం, ‘స్వస్త్ నారి స్వశక్త్ పరివార్’ పథకం కింద మొత్తం 4,096 మంది మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించారు.

ఈ పరీక్షల్లో బీపీ, షుగర్, కేన్సర్, మానసిక ఆరోగ్యం, గర్భిణీ పరీక్షలు, వ్యాక్సినేషన్, ఎనీమియా స్క్రీనింగ్, ఆరోగ్య సంరక్షణ కౌన్సెలింగ్, పోషకాహార సలహాలు, సికిల్ సెల్ స్క్రీనింగ్, టీబీ పరీక్షలు తదితర సేవలు అందించారని ఆమె తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *