16/04/2026
Untitled design (3)

Sadashivpet News : గుండె సంబంధిత సమస్యలను ముందుగానే గుర్తించి సరైన చికిత్స అందించేందుకు మెడికవర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీ హైదరాబాద్ యూనిట్‌కు చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ సదాశివపేటలో ప్రత్యేక కన్సల్టేషన్ సేవలు అందించనున్నారు. ఈ కార్యక్రమం ప్రతి గురువారం ఉదయం 11:30 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు విజయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, సదాశివపేటలో నిర్వహిస్తున్నట్లు యాజమాన్యం పేర్కొన్నారు.


ఈ కార్యక్రమంలో కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డా. దయా వాస్వని పాల్గొని గుండె సంబంధిత సమస్యలపై ప్రత్యేక కన్సల్టేషన్ సేవలు అందించనున్నారు అని వారు పేర్కొన్నారు. గురువారం గుండె సంబంధిత సేవలు అందించిన ప్రముఖ గుండె వైద్య నిపుణులు
డా. దయా వాస్నవి రోగులకు పలు సూచనలు చేశారు.
మెట్లు ఎక్కినప్పుడు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, నడిచేటప్పుడు ఛాతిలో నొప్పి, భుజం నుండి చేతుల వరకు నొప్పి వ్యాపించడం, బీపీ మరియు షుగర్ ఉన్నవారిలో గుండె సమస్యలు, అధిక కొలెస్ట్రాల్, గుండె దడ, ఊబకాయం, కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉన్నవారు ఈ కన్సల్టేషన్ సేవలను వినియోగించుకోవచ్చు అన్నారు.
గుండె జబ్బులను ప్రారంభ దశలోనే గుర్తించడం ద్వారా భవిష్యత్తులో వచ్చే తీవ్రమైన సమస్యలను నివారించవచ్చని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. సరైన ఆహారం, వ్యాయామం, ఒత్తిడి నియంత్రణ మరియు సమయానికి వైద్యులను సంప్రదించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని జాగ్రత్తలు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *