Sangareddy News : గురువారం సంగారెడ్డి కలెక్టరేట్లో జిల్లాలోని జూనియర్ కళాశాలలో, సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపల్ లు మహిళా సంక్షేమ శాఖ అధికారులు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖల అధికారులు, జిల్లాలోని అన్ని రకాల విద్యాసంస్థలు అంగన్వాడీ కేంద్రాలలో మౌలిక వసతుల కల్పన,. IERC పనులు, KGBVs మరమ్మత్తులు, TSWREIS, గిరిజన సంక్షేమ సంస్థల పనులు, DIEO పరిధిలోని జూనియర్ కాలేజీల మరమ్మత్తులు, AAPC పెండింగ్ పనులు, అదనపు తరగతి గదుల నిర్మాణం, అలాగే UDISE డేటా అప్‌డేట్, శిధిలావస్థ లో ఉన్న భవనాల నివేదికలపై సుధీర్ఘంగా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. విద్యా, సంక్షేమ రంగాల్లో జరుగుతున్న మౌలిక సదుపాయాల పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. జిల్లాలోని విద్యాసంస్థల్లో ఇంటర్ చదువుతున్న విద్యార్థులు ఈ ఏడాది మెరుగైన ఫలితాల సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి అన్నారు. కనీసం 70 నుండి 80% మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యేలా చూడాలన్నారు . ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు నిరుపేద విద్యార్థులని వారికి ఇంటర్ తర్వాత ఏ కోర్సులు చదివితే ఇలాంటి ఉపాధ్యాయులు దొరుకుతాయి అన్న వాటిపై అవగాహన సరిగా లేదని వారికి పూర్తిస్థాయిలో ఇంటర్ తర్వాత ఏ కోర్స్ చదివితే ఎలాంటి ఉపాధి అవకాశాలు కొరకు అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు . ఆదిశగా ఉపాధ్యాయులు చర్యలు చేపట్టాలన్నారు. ఈ ఏడాది జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థల నుండి అత్యధిక సంఖ్యలో విద్యార్థులు నీట్, జేఈఈ లో మెరుగైన ర్యాంకులు సాధించి ఉన్నత విద్యాసంస్థలలో సీట్లు పొందేలా చూడాలన్నారు. అందుకోసం అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులు కల్పించడానికి సి ఎస్ ఆర్ నిధులు ఎంతైనా ఖర్చు చేస్తామని కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. జిల్లాలోని అన్ని కళాశాలలు ప్రభుత్వ విద్యా సంస్థలలో ప్రొజెక్టర్ లను ఏర్పాటు చేసి వాటి ద్వారా విద్యార్థులకు సులభంగా పోటీ పరీక్షలకు సిద్ధం చేసేలా ప్రణాళికలు రూపొందించాలని సిఎస్ఆర్ నిధులతో ప్రొజెక్టర్లు అందించడం అందుకు అవసరమైన ప్రతిపానుల సిద్ధం చేయాలని అధికారులకు ఈ సందర్భంగా కలెక్టర్ ఆదేశించారు. 2025- 26 విద్యాసంవత్సరానికి ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్లు తప్పనిసరిగా పెంచాలని ఇంటర్మీడియట్ స్థాయిలో నిర్దిష్ట ఉత్తీర్ణతశాతం సాధించేందుకు అన్ని కళాశాల సిబ్బంది కృషి చేయాలి అన్నారు .
అధ్యాపకులు , విద్యార్థుల హాజరు, పర్యవేక్షణ కోసం ప్రతి కళాశాలలో , విద్యాసంస్థలలో ఫేస్ రికగ్నైజేషన్ హాజరు వ్యవస్థను తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. విద్యా ప్రమాణాలు మెరుగుపడేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహించి పోటీ పరీక్షల పై శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ విద్యా సంస్థల్లో అవసరం ఉన్న చోట కొత్త కిచెన్ సిద్ధ నిర్మాణం కోసం ప్రతిపాదన సమర్పించాలని నిర్మాణం పనులు వెంటనే ప్రారంభమయ్యేలా చూడాలని వాడుకలో లేని టాయిలెట్లకు మరమ్మతులు చేసి విద్యార్థుల వినియోగానికి అందుబాటులో ఉంచాలని కలెక్టర్ సూచించారు.
భారీ వర్షాల కారణంగా శిథిలవస్థకు చేరిన తరగతి గదులు హాస్టల్ గదులను, అంగన్వాడీ కేంద్రాల భవనాలను ప్రీ ప్రైమరీ పాఠశాలల పనులు, పాఠశాలల మరుగుదొడ్ల నిర్మాణ పనులు కిచెన్ షర్టు నిర్మాణం పనులు , అంగన్వాడీ భవనాల నిర్మాణం వంటి అంశాలను చర్చించి , జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు విద్యుత్ తాగునీటి సౌకర్యం మరుగుదొడ్ల వంటి మౌలిక వసతులు కల్పించడంలో సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు. అవసరమైన మరమత్తు పనులకు ప్రతిపానులు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. పూర్తి శిథిలావస్థకు గదులను వెంటనే తొలగించాలని అధికారులకు సూచించారు.
విద్యా సంస్థల్లో తాగునీటి సౌకర్యం తరిగదు గదుల మేజర్ మైనర్ మరమ్మత్తులు విద్యుత్ సౌకర్యం పెయింటింగ్స్ బాలికల కోసం అదనపు టాయిలెట్ల నిర్మాణం వంటి మౌలిక వసతులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ సూచించారు. ఇంజనీరింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో స్థాయిలో అన్ని పాఠశాలలను విద్యాసంస్థలను తనిఖీ చేసి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి త్వరితగతిన సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు పాఠశాలల్లో చేపట్టాల్సిన పనులు అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా పూర్తి చేయాలన్నారు పాఠశాలల మౌలిక వసతులు అభివృద్ధి కోసం ప్రభుత్వం తగిన నిధులు మంజూరు చేస్తుందని వాటిని యోగం చేసుకోవాలన్నారు ఇప్పటికే కొన్ని పాఠశాలలో చేపట్టాల్సిన పనులను గుర్తించమని మిగిలిన పాఠశాలలో కూడా త్వరగా ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు మౌలిక సదుపాయాల కల్పనతో పాఠశాలల అభివృద్ధి విద్యార్థుల భవిష్యత్తు మరింత మెరుగుపడుతుందని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లాలో చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ వర్కింగ్ మూమెంట్ హాస్టల్ పర్యవేక్షణ అవశ్యకమని అన్నారు .
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ , జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, ఇంటర్మీడియట్ శాఖ అధికారి గోవిందరావు, ఈఈ పి ఆర్ జగదీష్, డిపిఓ సాయిబాబా, ఐసిడిఎస్ పిడి లలిత కుమారి, టీఎస్ ఈ డబ్ల్యూ ఐ డి సి , ఈ ఈ. శ్రీనివాస్ రెడ్డి , విద్యుత్ శాఖ అధికారి రఘువీర్, అడిషనల్ డిఆర్డిఓ లు బాలరాజు, సూర్యారావు, ఇంటర్ మీడియట్ కళాశాలల ప్రిన్స్ పాల్స్, ఎంఈఓ లు ఎంపీడీవోలు, ఆర్ సి ఓ లు, సంబంధిత శాఖలు ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
