17/02/2026
Sadashivpet News

Sadashivpet News : దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 22వ తేదీ సోమవారం నుండి సదాశివపేట పట్టణంలో స్థానికులు సుమారు 6 అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు చేసి పూజల అందించనున్నారు .స్థానిక గాంధీ చౌక్ వద్ద జై భవాని యూత్ అసోసియేన్ ఆధ్వర్యంలో మాజీ కౌన్సిలర్ ఆకుల శివకుమార్ గత 23 సంవత్సరాల గా ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.ఈ ఏడాది కూడా ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. పట్టణంలోని హట్కర్ పేట తుల్జా భవాని యూత్ ,శంభు లింగేశ్వర మందిరం ప్రాంగణంలో జోగులాంబ సేవాసదన్, గురు నగర్ కాలనీలో ప్రముఖుల ఆధ్వర్యంలో అమ్మవారు,సిద్దాపూర్ కాలనీ సంజీవిని పర్వత ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో త్రినేత్ర యూత్ సభ్యులు,పంచముఖి ఆంజనేయస్వామి ఆలయం ప్రాంగణంలో భవాని యూత్ సభ్యులు ..తొమ్మిది రోజులపాటు అమ్మ వారిని నెలకొల్పి అమ్మవారికి ఉదయం, సాయంత్రం భక్తిశ్రద్ధలతో నిత్య పూజలు నిర్వహించి,మండపాల వద్ద వివిధ సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా నవరాత్రి ఉత్సవాలను భక్తులు వైభవంగా జరుపుకోనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *