Sadashivpet News : సదాశివపేట మండలంలోని సెయింట్ ఆంథోనీ పాఠశాలలో శుక్రవారం సదాశివపేట మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం శుక్రవారం ఘనంగానిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా మండల విద్యాధికారి ఎన్.శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…మండలంలోని వివిధ పాఠశాలలో పనిచేస్తున్న 26 మందికి ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారాన్ని అందించడం జరిగిందని తెలిపారు. విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తూ మీ పాఠశాలకు, మీ గ్రామానికి, అదేవిధంగా మండలానికి మంచి పేరు తీసుకొచ్చి అన్ని విభాగాలలో జిల్లాలో మన మండలాన్ని మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అన్ని ఉపాధ్యాయ సంఘాల నేతలకు, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు,ఉపాధ్యాయులకు,సిఆర్పిలకు , ఎంఆర్సి సిబ్బందికి అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల నోడల్ అధికారిసుధాకర్,వివిధఉపాధ్యాయ సంఘ నాయకులు,కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిఆర్పిలు, తదితరులు పాల్గొన్నారు.
