14/04/2026

Sangareddy News : మహారాష్ట్రలోని శ్రీ తుల్జాపూర్ గ్రామం నందు స్వయంబుగా వెలిసిన శ్రీ తుల్జా భవాని దేవి నవరాత్రుల సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పులుమామిడి రాజు తన కుటుంబ సభ్యులతో కలిసి తుల్జా అంబాయి అమ్మవారికి ప్రత్యేక అభిషేకము, దీక్ష సంకల్పము, గోందాలము, స్పర్శ దర్శనము, జోగు వంటి కార్యక్రమాలను ఆలయ పురోహితులు పండిత్ రోహిత్ కదం పరమేశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా పులిమామిడి రాజు మాట్లాడుతూ ఇక్కడి అమ్మ వారు స్వయంబుశక్తి స్వరూపిణి అని, ప్రజల సంక్షేమం కొరకు, ప్రజల కష్టాలను తీరుస్తూ, కోరిన వారికి కొంగు బంగారమై భక్తుల కోరిన కోరికలు నెరవేరుస్తున్నటు వంటి మహా శక్తి అమ్మవారని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. తదుపరి తన మాతృమూర్తి అయిన కీర్తిశేషులు పులిమామిడి బాగమ్మ జ్ఞాపకార్థం భక్తులందరికి మహా అన్నదాన వితరణ కార్యక్రమాన్ని తన సతీమణి పులిమామిడి మమత, కుమార్తె మాధవి, తనయుడు మనోజ్ మరియు పి. ఎం. ఆర్ యువసేన సభ్యులతో కలిసి నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తాలెల్మ రాము, రాణి, చంద్రశేఖర్, అఖిల్, పరమేష్, విగ్నేష్, సంజయ్, సోమ శంకర్ మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *