18/02/2026
aa (1)

Sangareddy News : సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో క్రీడ మైదానం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య ఆదేశించారు . కళాశాల ప్రాంగణంలో ఆధునిక సౌకర్యాలతో కూడిన క్రీడా మైదానం (స్పోర్ట్స్ గ్రౌండ్) ఏర్పాటు కు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ శాఖ అధికారులకు సూచించారు . మంగళవారం సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రాంగణంలో పర్యటించారు . ఆర్ అండ్ బి (రోడ్స్ అండ్ బిల్డింగ్స్) ఇంజనీరింగ్ అధికారులు, జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి (డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ) జి జి హెచ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు కలిసి కళాశాల ప్రాంగణంలో స్పోర్ట్స్ గ్రౌండ్ ఏర్పాటుకు కొరకు అవసరమైన స్థలం సర్దుబాటు మార్గాలపై సమీక్షించారు. . కళాశాల విద్యార్థులకు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించేలా ప్రోత్సహించేందుకు ఆధునిక సౌకర్యాలతో కూడిన క్రీడా మైదానం ఏర్పాటు చేయడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. విద్యార్థులు పాఠ్యాంశాలతో పాటు క్రీడల్లో పాల్గొనడం వల్ల మానసిక వికాసం,పెంపొందుతుందని తెలిపారు. మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేయనున్న క్రీడా ప్రాంగణంలో క్రికెట్ ప్రాక్టీసింగ్ నెట్ కోర్టులు , వాలీబాల్ కోర్ట్ , త్రోబాల్ కోర్టు, బాస్కెట్‌బాల్ కోర్ట్ బ్యాడ్మింటన్ , వంటి క్రీడలకు అనువైన మల్టీపర్పస్ ప్లే గ్రౌండ్ రూపకల్పన చేయాలని జిల్లా క్రీడా అధికారి ఖాసీం భెగ్ కు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *