18/02/2026
Sangareddy News

Sangareddy News : సంగారెడ్డి జిల్లాలో ఇందిరమ్మ చీరల పంపిణీని పూర్తిగా పారదర్శకంగా నిర్వహించి, మహిళలందరికీ ఎలాంటి లోపాల్లేకుండా చీరలు చేరేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, మహిళా సమాఖ్య ప్రతినిధులకు సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ చీరల పంపిణీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లు, మహిళా సమాఖ్యలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వాకాటి శ్రీహరి, సలహాదారు వేం. నరేందర్ రెడ్డి, ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సమైక్య బలోపేతం ద్వారా గ్రామీణ మహిళల ఆర్థిక–సామాజికాభివృద్ధి లక్ష్యంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఒక కోటి మహిళలను కోటీశ్వరులు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఈ లక్ష్య సాధనలో మహిళా సమైక్యలు కీలక పాత్ర పోషించాలి అని పేర్కొన్నారు. వయోజన చదువు కార్యక్రమాలను బలోపేతం చేసి, చదువు నేర్చుకున్న మహిళలను ఓపెన్ SSC, ఇంటర్ పరీక్షలకు ప్రోత్సహించాలని మహిళా సంఘాలు సభ్యులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో అదరపు కలెక్టర్ చంద్రశేఖర్, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, డిపిఓ సాయిబాబా, పిడి మెప్మా ఇన్చార్జ్ , ఈ డి కార్పొరేషన్ అధికారి రామాచారి, అదనపు డిఆర్డిఓ లు బాలరాజు, సూర్యారావు,జిల్లా మహిళా సమైక్య సభ్యులు, ఏ పీ ఎం లు ,సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *