14/04/2026

Sadashivpet News : సదాశిపేట మండల స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్ స్థానిక తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ నందు శుక్రవారం జరిగింది. సదాశిపేట పట్టణ మరియు మండలంలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలు పాల్గొన్న ఈ చెకుముకి మండల స్థాయి టాలెంట్ టెస్ట్ లో జీనియస్ స్కూల్ ఆఫ్ ఎక్స్లెంట్ విద్యార్థులు రోహన్ రెడ్డి, తహేర యూసుఫ్ , ఖాజా మొయినుద్దీన్ లు మండల ప్రథమ స్థానంలో నిలిచారు. మండల ప్రథమ స్థాయి విజేతలకు సదాశివపేట మండల విద్యాధికారి శ్రీ ఎన్.శంకర్ ప్రశంస పత్రం మరియు బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రీతి మేడం మాట్లాడుతూ. మూఢనమ్మకాలపై జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చెకుముకి టాలెంట్ టెస్ట్ లో తమ పాఠశాల విద్యార్థులు ప్రథమ స్థాయి విజేతలుగా గెలుపొందడం సంతోషకరమని విద్యార్థులను అభినందించారు.ఈ కార్యక్రమంలో లో జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు బాలయ్య సార్, స్కూల్ ప్రిన్సిపాల్ ప్రీతి, వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్, సాయి కిరణ్ సార్ పాల్గొన్నారు
ఫోటో రైట్ అప్. చెకుముకి టాలెంట్ టెస్ట్ లో జీనియస్ స్కూల్ ఆఫ్ ఎక్స్ల్లెంట్ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేస్తున్న మండల విద్యాధికారి శంకర్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *