Sangareddy News : సంగారెడ్డి జిల్లా కంది మండలం ఇంద్రకరణ్ గ్రామంలో కన్య స్వాములు బుర్ర ప్రవీణ్, పుర్ర నవీన్ స్వాముల ఆధ్వర్యంలో వైభవంగా శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు…
ఉదయం ప్రారంభమైన పూజా కార్యక్రమాలు వేదఘోషాలతో, సంప్రదాయ మంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా సాగాయి…
ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో శాంతి, సౌహార్దాన్ని పెంపొందిస్తాయని చెప్పారు…
ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ను నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు…
కార్యక్రమంలో మాజీ సి డి సి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి,నాయకులు చింత సాయినాథ్ ,ఆర్ వెంకటేశ్వర్లు, ప్రభాకర్ , నర్సన్న, పుర్ర నారాయణ యాదవ్, పుర్ర మహిపాల్ యాదవ్, ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
