Sadashivpet News :వేస్ట్ టు వెల్త్ జిల్లా స్థాయి ప్రదర్శనను సంగారెడ్డి జిల్లా లోని సదాశివపేట మండలం లో సెయింట్ మేరీస్ హై స్కూల్ పాఠశాలలో నిర్వహించడం జరిగింది. ఈ ప్రదర్శనలో జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు మరియు ప్రైవేటు పాఠశాలలు పాల్గొనడం జరిగింది. పాల్గొన్నటువంటి విద్యార్థులు సింగిల్ యూజుడ్ ప్లాస్టిక్ తో రకరకాల ఆకారాలను రకరకాల ప్రదర్శనలు చేసి ఈ ప్రదర్శనలో చూపించడం జరిగింది. ప్రదర్శన యొక్క ముఖ్య ఉద్దేశం సింగిల్ యూస్డ్ ప్లాస్టిక్ను ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలని ఉద్దేశంతో ఈ ప్రదర్శన కొనసాగించడం జరిగింది. ఈ ప్రదర్శనలో సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అనేక పాఠశాలలు పాల్గొని తమ ఎగ్జిబిట్స్ ను ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఈ ప్రదర్శన తిలకించడానికి వివిధ పాఠశాల నుండి అనేకమంది. విద్యార్థులు రావడం జరిగింది. వివిధ పాఠశాల నుంచి పాల్గొన్న ప్రతి విద్యార్థిని ,విద్యార్థులకు పటిస్పేట్ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. ప్లాస్టిక్ వాడకుండా పర్యావరణాన్ని కాపాడడం అందరి బాధ్యత అని అధికారులు తెలియజేశారు
ఈ కార్యక్రమంలో సదాశిపేట మండల విద్యాధికారి యన్.శంకర్, నేషనల్ గ్రీన్ క్రాఫ్ట్ రాష్ట్ర అధికారిని రాధిక, జిల్లా (యన్.జి.సి )అధికారి మాధవరెడ్డి, గైడ్ టీచర్స్, సెయింట్ మేరీ ప్రిన్సిపల్ రాబర్ట్,ఆయా పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొని విద్యార్థుల ప్రదర్శనలను తిలకించడం జరిగింది.
