18/02/2026
చింత సాయినాథ్ గారు కుటుంబ సభ్యులతో కలిసి కంబాలపల్లి శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న దృశ్యం

Sadashivpet News : సదాశివపేట మండలం కంబాలపల్లి గ్రామంలోని అతి పురాతన శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారి తనయుడు చింత సాయినాథ్ గారు కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా స్వామి వారి ప్రత్యేక పూజల్లో పాల్గొని మర్యాదపూర్వకంగా సేవలను నిర్వహించారు.

ఆలయ అర్చకుల మంత్రోచ్ఛారణల నడుమ కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొన్న సాయినాథ్ గారు, ప్రాంత ప్రజల అభ్యున్నతి, నియోజకవర్గ శాంతి, శ్రేయస్సు కోసం ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు.

తదుపరి ఆలయ అర్చకులు వారు స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు. గ్రామ BRS పార్టీ నాయకులు సాయినాథ్ గారిని ఘనంగా సన్మానించారు.

కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పెద్దగొల్ల ఆంజనేయులు, గ్రామ మాజీ సర్పంచ్ శ్రీహరి, గ్రామ శాఖ అధ్యక్షులు సుధీర్ రెడ్డి, వంగపల్లి మల్లేశం, చీమలదరి సుభాష్, గొల్ల కృష్ణ, బుజంగం, శ్రీశైలం, అరవింద్, రవి, జగదీష్ పంతులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *