Sadashivpet News : సదాశివపేట పట్టణంలోని శ్రీ విరాంజనేయ స్వామి ఆలయంలో వాహనం, ధ్వజ స్థంభ ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ మహోత్సవానికి సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారు , ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు…
ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. వేద మంత్రోచ్చారణల మధ్య వాహన ప్రతిష్ఠ, ధ్వజ స్థంభ ఆవిష్కరణ పూర్తికాగా, దేవస్థాన అభివృద్ధికి సంబంధించి అవసరమైన అన్ని సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు.
