14/04/2026

Sangareddy News : కాంగ్రెస్ ప్రభుత్వం హిల్ట్ పేరుతో పారిశ్రామిక ప్రాంతాల్లో ఉన్న భూములను అమ్మకం చేసేందుకు కుట్ర చేస్తుందని సంగారెడ్డి ఎమ్మెల్యే జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చింత ప్రభాకర్ అన్నారు…

పటాన్చేరు మండలం పాశమైలారం పారిశ్రామిక వాడలో బీఆర్ఎస్ మాజీ మంత్రి గంగుల కమలాకర్ , ఎమ్మెల్యే లు చింత ప్రభాకర్ , మాణిక్ రావు , ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ , కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు దేవి ప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్, పటాన్చెరు BRS పార్టీ కో-ఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి లు పర్యటించారు.

కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు…

HILTP పేరుతో పారిశ్రామిక భూములను ప్రైవేటు వ్యక్తులకు బదిలీ చేయొద్దని డిమాండ్ చేశారు…

తెలంగాణ ప్రభుత్వం ఇండస్ట్రియల్ పాలసీ పేరుతో ఐదు లక్షల కోట్ల పారిశ్రామిక భూముల కుంభకోణం చేసినందుకు ప్రయత్నం చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 27 జారీ జేసి భూములను ఖాళీ చేసేందుకు ప్రయత్నం చేస్తుందని ఎమ్మెల్యే అన్నారు…

ప్రభుత్వం నిర్ణయించిన ధర ఎకరానికి రూ.37 లక్షలు మాత్రమే… కానీ మార్కెట్‌లో ఈ భూమి ధర కోట్లలో ఉందన్నారు… ప్రస్తుతం ఇక్కడ ఎకరానికి 20 కోట్లు ధర పలుకుతుందన్నారు… పాశ మైలారం పారిశ్రామిక వాడ ఏర్పాటు కోసం రైతుల నుంచి భూసేకరణ చేశారన్నారు…

ప్రభుత్వం జారీచేసిన 27 జీవోను తిరిగి వెనుకకు తీసుకోవాలని డిమాండ్ చేశారు…

ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్,మాజీ జడ్పీటీసీ గడిల శ్రీకాంత్ గౌడ్, బీఆర్ఎస్ నేతలు, తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *