Sangareddy News : ఎన్నికల్లో ప్రిసైడింగ్ అధికారుల పాత్ర అత్యంత కీలకమైనదని,పోలింగ్ విధులను ప్రిసైడింగ్ అధికారులుసమర్ధవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్
పి. ప్రావీణ్య సూచించారు.
సదాశివపేట మండలం మద్దికుంట చౌరస్తాలోని కింగ్స్ ఫంక్షన్ హాల్ లో మొదటి దశ పంచాయితీ ఎన్నికలకు సంబంధించి ప్రిసైడింగ్ అధికారులకు రెండవ విడత శిక్షణ తరగతులు నిర్వహించారు. శిక్షణ తరగతులను సందర్శించిన కలెక్టర్, ఈ సందర్భంగా ప్రిసైడింగ్ అధికారులకు పోలింగ్ విధులకు సంబంధించి కీలకమైన పలు సూచనలు చేసారు. పోలింగ్ ప్రక్రియలో పీ.ఓ లు క్రియాశీలకంగా వ్యవహరించాల్సి ఉంటుందని అన్నారు. నిబంధనలు పక్కాగా పాటిస్తూ పోలింగ్ ప్రక్రియను సాఫీగా నిర్వహించాలని, ఏ చిన్న తప్పిదానికి ఆస్కారం కల్పించకూడదని చెప్పారు. సమయ పాలనను పాటిస్తూ, సకాలంలో నిర్దేశించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని అన్నారు. మొదటి విడత పోలింగ్ ఈ నెల 11న జరుగనున్న దృష్ట్యా, 10వ తేదీ నిర్ణీత సమయంలోపు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు చేరుకుని, పోలింగ్ మెటీరియల్ ను తీసుకోవాలన్నారు. చెక్ లిస్టుకు అనుగుణంగా బ్యాలెట్ పత్రాలు, ఇతర సామాగ్రి ఉందా లేదా అన్నది క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని తెలిపారు.
డిస్త్రిబ్యూషన్ కేంద్రం నుండి పోలింగ్ స్టేషన్ కు చేరుకొని ఓటింగ్ నిర్వహణ ఏర్పాట్లను ముందస్తుగా చక్కబెట్టుకోవాలని కలెక్టర్ మార్గనిర్దేశం చేశారు. సీటింగ్ అరేంజ్ మెంట్, సీక్రెట్ ఓటింగ్ కంపార్ట్మెంట్ వంటి వాటిని నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఓటింగ్ విషయంలో గోప్యత నూటికి నూరు శాతం అమలు జరిగేలా చూడాలన్నారు. ఓటరు జాబితాను అనుసరిస్తూ ఓటర్లను నిర్ధారించి, వారు ఓటు హక్కు వినియోగించు
కునేలా చూడాలాన్నారు. అనుమతి ఉన్న వారిని మాత్రమే పోలింగ్ కేంద్రాల లోపలికి అనుమతించా
లన్నారు.
ఎన్నికల సంఘం రూపొందించిన హ్యాండ్‌బుక్‌ను ప్రతీ పీఓ క్షుణ్ణంగా చదివి స్పష్టమైన అవగాహన ఏర్పరచు
కోవాలని, పోలింగ్ విధుల సందర్భంగా అన్ని నిబంధనలను పక్కాగా అమలయ్యేలా చూడాలన్నారు.
పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలు సాఫీగా జరిగి గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, సజావుగా పూర్తయ్యేలా సమర్ధవంతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలిస్తూ కట్టుదిట్టమైన పర్యవేక్షణ జరపాలని పీ.ఓలకు సూచించారు. ఎలాంటి సందేహాలు ఉన్నా, ముందుగానే నివృత్తి చేసుకోవాలని సూచించారు.
శిక్షణ కార్యక్రమంలో శిక్షణ తరగతుల నోడల్ అధికారి మరియు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామాచారి, తహసిల్దార్లతహసిల్దార్ బాల్ రాజ్, ఎంపీడీవో లక్ష్మి, ప్రిసైడింగ్ అధికారులు, మాస్టర్ ట్రైనర్, తదితరులు పాల్గొన్నారు.
అదే విధంగా మొదటి దశలో జరగనున్న ఎన్నికలకు సంబంధించి గుమ్మడిదల, హత్నూర, కంది, కొండాపూర్, పటాన్చెరు, సంగారెడ్డి మండలాల ప్రైసైడింగ్ అధికారులకు కూడా రెండవ విడత శిక్షణ కార్యక్రమం ఆయా మండల కేంద్రాలలో నిర్వహించారు.
