14/04/2026

Sadashivpet News : ఈ నెల 11 మధ్యాహ్నం అందాజ 04:00 సమయమున ఒక గుర్తు తెలియని వ్యక్తి పెద్దాపూర్ పరిధిలోగల NH -65 రోడ్డు ఫ్లై ఓవర్ వద్ద నడుచుకుంటూ వెళుతుండగా గుర్తుతెలియని మోటార్ సైకిల్ నడుపుతున్న వ్యక్తి ఢీ కొట్టి వెళ్ళిపోగా అనంతరం చికిత్స పొందుతూ నడుచుకుంటూ వెళుతున్న గుర్తుతెలియని మగ వ్యక్తి అందాజా వయస్సు 60 నుండి 65 సంవత్సరాలు గల అతను మంగళవారం సాయంత్రం అందాజా 05:00 గంటలకు చికిత్స పొందుతూ సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి నందు చనిపోయినాడు. ఎవరైనా మృతుడి ఆచూకీ తెలిసిన యెడల ఫోన్ నెంబర్ 8712656721 లేదా 8712583463 లకు ఫోన్ చేసి తెలుపగలరని సదాశివపేట సిఐ వెంకటేష్ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *