Sangareddy News : సంగారెడ్డి జిల్లా సురక్ష ప్రతినిధి: తుది విడత స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా, నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మొత్తం 8-మండలాలలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలియజేశారు. ఓటు హక్కును వినియోగించుకోవడానికి తండోపతండాలుగా తరలి వస్తున్న ఓటర్లతో ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో జిల్లా ఎస్పీ స్వయంగా ట్రాఫిక్ సమస్యను పునరుద్దరించడం జరిగింది. ఈ సందర్భంగా నారాయణఖేడ్ మండలంలోని తుర్కపల్లి, నిజంపేట పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఎస్పీ పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లు, భద్రతాపరమైన చర్యలను సమీక్షించారు. అధికారులతో మాట్లాడుతూ.. ఎన్నికలు పూర్తి స్వేచ్ఛాయుతంగా వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలను తీసుకోవాలని, సిబ్బంది అధికారులు అప్రతంగా ఉండి, ఏ చిన్న అవాంఛనీయ సంఘటన చోటు చేసుకున్నా వెంటనే కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించాలని సూచించడం జరిగింది.
