Sadashivpet News : రక్తదానం ప్రాణదానంతో సమానమని ఆత్మకూరు బ్లడ్ డోనార్స్ అధ్యక్షుడు తమ్మలి రవిఅన్నారు.మరోసారి రక్తదానం చేసిన యువకులను ఉద్దేశించి గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. వివరాల్లోకెళ్తే. వరుసకు రవికి వదిన అయినా వికారాబాద్ జిల్లా తాండూర్ కు చెందిన రజితకు స్థానిక వికారాబాద్ పట్టణంలోని స్కంద హాస్పిటల్ లో చికిత్స పొందుతు ఆపరేషన్ కోసం అత్యవసరంగా రక్తం అవసరం వుండటంతో అధ్యకులు రవి చొరవతో వెంటనే మండల పరిధిలోని ఆత్మకూరు గ్రామ యువకులు పల్లె రమేష్ … దాసరి బాలు…ఆరే కటికే రోషన్…కపిలే నరేష్ రక్త దానం చేసి మానవత్వం చాటుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ…
రక్తదానం అంటే ప్రాణాలను కాపాడే గొప్ప కార్యం అని,ఒక వ్యక్తి స్వచ్ఛందంగా తన రక్తాన్ని అవసరమైన వారికి దానం చేయడం ద్వారా అత్యవసర పరిస్థితులు, శస్త్రచికిత్సలు మరియు రక్త మార్పిడి అవసరమైన రోగులకు సహాయపడుతుందన్నారు.రక్తదానం చేయడం వల్ల దాతకు గుండె ఆరోగ్యం మెరుగుపడటం, గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుందని మరియు శరీరంలోని అదనపు ఇనుమును తొలగించడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేస్తుందన్నారు. రక్తదానం చేసిన యువకులకు రవి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. రక్తదానం చేయడానికి యువకులు ముందుకు రావాలని, అత్యవసర సమయంలో ప్రాణాలు కాపాడిన వారు అవుతారని ఈ సందర్భంగా యువకులకు ఆయన పిలుపునిచ్చారు.
