Sadashivpet News : రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా జనసేన పార్టీ ప్రధాన రాజకీయ పార్టీలకు దీటుగా బరిలోకి దిగనుందని రాష్ట్ర నాయకులు రాధారం రాజలింగం స్పష్టం చేశారు. సదాశివపేటలో గురువారం నిర్వహించిన జనసేన పార్టీ సమావేశంలో ఆయన తెలియజేశారు
సంగారెడ్డి నియోజకవర్గం సదాశివపేట మండలం మున్సిలపాలిటీ లో జరిగిన జనసేన పార్టీ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.నియోజకవర్గం poc సభ్యులు సానది రమేష్ మరియు లింగం గౌడ్ నియోజవర్గం నాయకులు మునిపల్లి సాకేత్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో
ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి రాధారం రాజలింగం
మాట్లాడారు.పార్టీ బలోపేతానికి ప్రతి జన సైనికుడు కష్టపడి పనిచేయాలని సూచించారు. అంతకుముందు పలువురు కార్యకర్తలతో పాటు మహిళలు కూడా జనసేన పార్టీలో చేరగా అదే ఉత్సాహం తో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతుందన్నారు..
ఉగ్గెల్లి ఉదయ్ కుమార్ 7th వార్డు, ఉగ్గెల్లి శృతి 22 వార్డు, నిరడి రాజు కుమార్ , మాచిరెడ్డిపల్లి సందీప్, సూర్య, సంగీత, వారికి రాధారం రాజలింగం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, శ్రీ పవన్ కళ్యాణ్ గారికి రెండు తెలుగు రాష్ట్రాలు రెండు కళ్ల వంటివని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంపై శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన అభిమానం ఉందన్నారు.
తెలంగాణ జనసేన కార్యకర్తల అభిప్రాయాల మేరకు, శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాలతో తెలంగాణలో జనసేన పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తోందని తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో జనసేన పార్టీ విజయ దుందుభి మోగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సంగారెడ్డి నియోజక వర్గ ఇంచార్జి మునిపల్లి సాకేత్, నాయకులు సురేష్, శ్రీకాంత్, ఉదయ్,శృతి,సంగీత, శ్రీకాంత్, ఈశ్వర్, తేజ, మోహన్, వెంకటేశం, పండు, రాజ్ కుమార్, సందీప్,తదితరులు పాల్గొన్నారు.
