17/02/2026
sangareddy news

Sadashivpet News : వినూత్న ఆలోచనతో…సరికొత్త ఆవిష్కరణకు రూపం ఇచ్చిన విద్యార్థి ప్రతిభ ను పలువురు అభినందిస్తున్నారు. పర్యావరణహిత రవాణా దిశగా ,తకువ ఇంధనం ఖర్చుతో బ్యాటరీ సైకిల్ సదాశివపేట మండలంలోని ఆత్మకూర్ గ్రామంలో జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థికి సాయి కిరణ్ స్వయంగా రూపకల్పన చేసిన బ్యాటరీ సైకిల్‌ను సోమవారం ఆత్మకూరు పాఠశాలలో గణతంత్ర దినోత్సవం వేడుకల్లో విజయవంతంగా ఆవిష్కరించారు. ఈ వినూత్న ఆవిష్కరణకు స్థానిక గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు ఇందూరి రమేష్ అందించిన ఆర్థిక సహకారం ఎంతో తోడ్పడింది.

ఈ బ్యాటరీ సైకిల్ తక్కువ ఖర్చుతో, ఇంధనాన్ని వినియోగించకుండా, రోజువారీ ప్రయాణాలకు అనువుగా రూపొందించబడింధని,ఇది వాయు కాలుష్యాన్ని తగ్గించడంలో తోడ్పడటంతో పాటు, పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని సాయికిరణ్ వివరించారు. ఈ ఆవిష్కరణ ద్వారా సాయి కిరణ్ సాంకేతిక నైపుణ్యం ,సాంకేతికతపై ఉన్న ఆసక్తి మరింత ముందుకు సాగాలని ఎన్నో కొత్త ఆవిష్కరణలు చేయాలని దానికి ప్రతి ఒక్కరు సయ సహకారాలు, చైతన్య అందించాలని, దోహదపడాలని పలువురు కోరారు.ఈ సందర్భంగా మాట్లాడిన ఇందూరి రమేష్ యువతలోని ప్రతిభను ప్రోత్సహించడం సమాజ అభివృద్ధికి ఎంతో అవసరమని తెలిపారు. ఇలాంటి ఆవిష్కరణలు భవిష్యత్తు తరాలకు ప్రేరణగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ బ్యాటరీ సైకిల్ ఆవిష్కరణకు స్థానికంగా మంచి స్పందన లభిస్తోంది. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేసి ప్రజలకు ఉపయోగకరంగా మారే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *