15/02/2026
Sangareddy News

Sangareddy News :మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో ముగ్గురు వ్యక్తులకు న్యాయస్థానం రెండు రోజులు జైలు శిక్ష విధించిన ఘటన బుధవారం సదాశివపేట పోలీసు స్టేషన్ పరిధి లో జరిగింది. సదాశివపేట పోలీసు వారు సదాశివపేట పట్టణంలోని వెహికిల్ చెకింగ్ నిర్వహిస్తుండగా మునిపల్లి మండలంలో గల పోల్కంపల్లి గ్రామానికి చెందిన గొల్ల శ్రీకాంత్, మునిపల్లి మండలం ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన M. D. మహబూబ్ అలీ మరియు సదాశివపేట పట్టణానికి చెందిన తుడుం ప్రవీణ్ లు మద్యం సేవించి బైకు నడుపుతుండగా పోలీసులు వారిని పట్టుకున్నారు, నిదుతులకు బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించి మద్యం సేవించినట్లు తేలడంతో కేసు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరు పరిచారు, కేసును విచారించిన సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ షకీల్ అహ్మద్ సిద్ధికి ముగ్గురికి రెండు రోజులు జైలు శిక్ష విదిస్తూ తీర్పు ఇచ్చినట్లు సదాశివపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *