15/02/2026
Sangareddy News

Sadashivpet News : సదాశివపేట మున్సిపాలిటీ పరిధిలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి శుక్రవారం స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పార్టీ తరఫున ఎవరికి అవకాశం లభించినా మిగిలిన కార్యకర్తలంతా ఐక్యంగా పని చేసి అభ్యర్థులను గెలిపించి సదాశివపేట మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా నిరంతరం కృషి చేస్తుందని ఆమె తెలిపారు. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు ఆడే మైండ్ గేమ్స్‌ను పట్టించుకోకుండా ధైర్యంగా ముందుకు సాగాలని కార్యకర్తలకు సూచించారు. ప్రతి వార్డులో పార్టీ బలోపేతానికి కష్టపడుతూ ప్రజల మద్దతుతో విజయం సాధించాలని కోరారు.

ఈ సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం సదాశివపేట మున్సిపాలిటీ పరిధిలోని వా

వార్డు వారీగా కాంగ్రెస్ అభ్యర్థులు:

1వ వార్డు – పిల్లోడి విశ్వనాథం
2వ వార్డు – ఎరుకల నర్సింలు
3వ వార్డు – రేణుక చిరంజీవి
4వ వార్డు – మొయిజ్
5వ వార్డు – ఉత్తేజ ఫాతిమా
7వ వార్డు – అనిత విష్ణువర్ధన్ రెడ్డి
8వ వార్డు – రేణుక శ్రీనివాస్ గౌడ్
9వ వార్డు – అరుణ్ కుమార్
10వ వార్డు – కంది నర్సింలు
11వ వార్డు – గోపి ప్రియాంక
12వ వార్డు – పులిమామిడి మమత రాజు
13వ వార్డు – భవానీ విశ్వనాథం
14వ వార్డు – స్వరూప రమేష్
15వ వార్డు – గోసియ బేగం
16వ వార్డు – కొత్తగొల్ల చంద్రశేఖర్
17వ వార్డు – షాజీ
18వ వార్డు – నికిత ప్రేమ కుమార్
19వ వార్డు – రోజా నాగరాజు
20వ వార్డు – అంజమ్మ సత్యనారాయణ
21వ వార్డు – వాజిద్
22వ వార్డు – పట్నం విజయలక్ష్మీ సుభాష్
23వ వార్డు – లక్ష్మీ ప్రియ భరత్
24వ వార్డు – కాలిం
25వ వార్డు – శంకర్ గౌడ్
26వ వార్డు – హారిక విజయ్

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటనతో సదాశివపేట మున్సిపల్ ఎన్నికల రాజకీయ వాతావరణం మరింత ఉత్కంఠభరితంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *