Sadashivpet News : మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ దే గెలుపు అని సదాశివపేట
13వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఎర్ర విశాలి నాగరాజ్ గౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు.పట్టణంలో గురువారం మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..
తమ ప్రభుత్వంలో కెసిఆర్ సంక్షేమ పథకాలు తమ అభ్యర్థులను గెలిపిస్తాయని.. ప్రజలు మరోసారి కెసిఆర్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని ఆమె వివరించారు. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో తాను భారీ మెజార్టీతో గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. నామినేషన్ దాఖలు కార్యక్రమంలో నాయకులు దిడిగే నాగేష్ ఉన్నారు.
