15/02/2026
Untitled design (3)

Sangareddy News :ఎన్నికల కోడ్ ఉల్లగించినందుకు శ్రీ.జయప్రకాష్ రెడ్డి (జగ్గారెడ్డి) , వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ పై కేస్ నమోదయింది. సదాశివపేట సిఐ వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం..మంగళవారం అందజ 10.30 గంటలకు, సదాశివపేట్ మున్సిపల్ ఎలెక్షన్ కు చెందిన సదాశివపేట్ FST టీమ్ కు శ్రీ.జయప్రకాష్ రెడ్డి మరియు మరి కొంతమంది సదాశివపేట్ బస్ స్టాప్ ముందు హోటల్ దగ్గర వుండి జగ్గారెడ్డి డబ్బులు పంచుతున్నరాని సమాచారం రాగా, వెంటేనే FST టీమ్ అక్కడి కి వెళ్ళి చెక్ చేయగా అక్కడ శ్రీ.జయప్రకాష్ రెడ్డి వున్నారని తెలిపారు. కానీ ఎవరికి డబ్బులు పంచడం లేదని,కానీ ఎన్నికల నియమావళి ప్రకారం 48 గంటల పోలింగ్ ముందు వేరే ప్రాంతానికి చెందిన రాజకీయ వ్యక్తులు ఇంకొక ప్రాతంలో వుండకూడదు. ఎన్నికల నియమావళి ఉల్లగించినందుకు శ్రీ. జగ్గారెడ్డి పై సదాశివపేట్ పోలీసు స్టేషన్ లో కేస్ నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *