14/04/2026
Untitled design (7)

Sadashivpet News : పేటలో నూతనంగా ఏర్పాటు చేసిన వెంకటేశ్వర షాపింగ్‌ మాల్‌ను ప్రారంభించిన నేపథ్యంలో.. సినీనటి నిధి అగర్వాల్ షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవంలో పాల్గొని సందడి చేసింది. దీంతో అభిమానులు నిధి అగర్వాల్ ను చూసేందుకు భారీగా తరలివచ్చారు. నిధి అగర్వాల్ పలు వస్ర్తాభరణాలను పరిశీలించి వాటిని ప్రదర్శించారు. ప్రారంభోత్సవం సందర్భంగా వెంకటేశ్వర షాపింగ్ మాల్ ఎండి వెంకటేశం,..ఆఫర్లు ప్రకటించడంతో కొనుగోలుదారులతో షాపింగ్‌ మాల్‌ సందడిగా మారింది.

పట్టణంలోసోమవారం నూతనంగా ఏర్పాటు చేసిన వెంకటేశ్వర షాపింగ్‌ మాల్‌ను మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరై సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు లతో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టిజిఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, ఎంపీ రఘునంద న రావు, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *