16/04/2026
Untitled design

Sadashivpet News : డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ రేణుక చిరు ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి శోభయాత్ర అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ దేశానికి ఎన్నో సేవలు చేశాడని, దూరదృష్టి వల్లే భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించేందుకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని, విద్య ద్వారానే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని విద్యార్థులకు కృషిచేసి జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు. భారత రాజ్యాంగం గొప్పదని యువత చదువుపై దృష్టి సారిస్తూ సమాజంలో మంచి పౌరులుగా ఎదగాలని సూచించారు.
అనంతరం వైస్ చైర్పర్సన్ రేణుక చిరు మాట్లాడుతూ ..యువత అంబేద్కర్ చూపిన మార్గంలో నడుచుకొని రాజ్యాంగ విలువలను ఆచరణాలు పెట్టాలని, సమసమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టి సమాజాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
ఈ శోభయాత్ర హరిజనవాడలోని అంబేద్కర్ విగ్రహం నుండి మొదలుకొని గొల్ల కేరి , శాస్త్రి రోడ్డు, బస్టాండు, సుభాష్ రోడ్డు గాంధీ చౌక్ మీదుగా నిర్వహించారు. శోభయాత్ర లో యువకులు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు అరుణ్, మనీ, లాజర్, నితిన్, దిలీప్, నరేష్, శశి, సాయి, వినోద్, అర్జున్, మోహిస్, జీవన్, నరసింహ, సుధాకర్, సిద్దు, జమీర్, ఉస్మాన్, సాజన్, కదిరి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *