సిద్ధాపూర్‌కు స్మశాన వాటిక కేటాయించాలి డిప్యూటీ తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేత
సదాశివపేట పట్టణంలోని 7వ వార్డు సిద్ధాపూర్ గ్రామానికి స్మశాన వాటిక కేటాయించాలని కోరుతూ కౌన్సిలర్ విష్ణువర్ధన్ రెడ్డి గ్రామస్తులతో కలిసి డిప్యూటీ తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో స్మశాన వాటిక లేకపోవడంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు స్పందించి గ్రామానికి తగిన స్థలాన్ని కేటాయించి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గొల్ల కృష్ణయ్య, గ్రామ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
#Siddapur
🏛️ మన సంగారెడ్డి ప్రత్యేక కథనం
